హైదరాబాద్: పింఛన్‌దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి పింఛన్ మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం బకాయిలను ఏక మొత్తంగా అందించనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2020 పీఆర్సీ ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ కూడా పెరిగింది. గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షల రూపాయలకు పెంచారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి 31 సమయానికి చెందిన బకాయిలను 36 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగా జనవరి పింఛనుతో కలిపి బకాయిలను చెల్లించనున్నారు. రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు తెలంగాణ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, విశ్రాంత ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
పింఛనుదారులకు బకాయిలు చెల్లింపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -