Saturday, January 11, 2025

రాయితీపై చలాన్ల చెల్లింపు నేటి నుంచే

- Advertisement -
- Advertisement -

Payment of challans on discount from today

కొన్ని వాహనాలపై రూ.70వేలకు పైనే బకాయిలు

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరి ధిలో 1.75 లక్షల చలా న్లు పెండింగ్‌లో ఉన్నాయ ని హైదరాబాద్ జాయిం ట్ పోలీస్ ట్రాఫిక్ కమిషనర్ ఎవి రంగనాథ్ అన్నారు. పెండింగ్ చలాన్లు ఈ నెల 1వ తేదీ నుం చి ఆన్‌లైన్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, మీ సే వా ద్వారా మార్చి 30వ తేదీ వరకు తీసుకోనున్న ట్లు తెలిపారు. పేద వర్గాలకు ఆర్థికంగా వెసులు బాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా మని తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచ కొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రూ.500 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొన్ని వాహనాలపై రూ.70వేల వరకు ఉండడంతో వాహనాలను పోలీస్ స్టేషన్లలో వదిలేశారని తెలిపారు.

నెల రోజుల తర్వాత కూడా వాహన దారులు పెండింగ్ చలాన్లు కట్టుకుండా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటిపై నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆటోలపై నిషేధం విధంచమని, వారికి గడువు ఇచ్చామని ఆ లోపు సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. దీనిపై ఆటో యూనియన్లకు సమాచారం ఇచ్చామని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు 75శాతం రాయితీ ఇచ్చామని వారు 25 శాతం కట్టాలని, కార్ల్లు, ఇతర వాహనాలు 50 శాతం, మాస్కు చలాన్లు ఉన్న వారు రూ.100 కడితే సరిపోతుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News