Thursday, November 21, 2024

సహార డిపాజిటర్లకు డబ్బు చెల్లింపు : అమిత్ షా

- Advertisement -
- Advertisement -

దరాబాద్ : కోట్లాది మంది కష్టపడి సంపాదించిన డబ్బును తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని కేంద్ర హోం శాఖ, సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో- సహారా రీఫండ్ పోర్టల్ https://mocrefund. crcs.gov.inను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహారా గ్రూపునకు చెందిన సహకార సంఘాల నిజమైన డిపాజిటర్లు క్లెయిమ్లను సమర్పించడానికి ఈ పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుంభకోణాలతో నష్టపోయిన బాధితులు తమ డబ్బును తిరిగి పొందడం.. పెద్ద విజయమని అమిత్‌షా అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి చిన్న పెట్టుబడిదారుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. పెట్టుబడిదారులకు రూ.5 వేల కోట్ల రీఫండ్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్.వర్మ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి జ్ఞానేష్ కుమార్, సహారా గ్రూపునకు చెందిన నాలుగు సహకార సంఘాల డిపాజిటర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News