పంచాయతీ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై
స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి
గ్రామాలకు కేటాయించే కేంద్ర నిధులు
పంచాయతీల అభివృద్ధికే వినియోగించాలి
ఉపాధిహామీ బిల్లులను వెంటనే చెల్లించాలి
సమీక్షా సమావేశంలో అధికారులకు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రా మ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీ తాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నె ల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వారికి ప్రతి నెలా రూ. 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉందని, వారికి జీతాల చెల్లింపులో ఆలస్యం కాకుండా స్పష్టమైన విధానం అనుసరించాలని పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్చానల్ లో వారికి జీతాలు చెల్లించాలన్నారు. గురువా రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క,
కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాం తి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ము ఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని వాటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదల అయ్యే నిధు లు ఎప్పటికప్పుడు గ్రామా ల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ, ప్ర ధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థ్ధిక సంవత్సరం ముగిసే లోపు రాబట్టుకోవాలని సిఎం అధికారులను అప్రమత్తం చేశారు.