Monday, December 23, 2024

పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..

- Advertisement -
- Advertisement -

Paytm losses increased, revenue up 89 percent

ఆదాయం 89 శాతం అప్

ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ నష్టాలు రూ.380 కోట్లుగా ఉన్నాయి. ఆదాయం 89 శాతం పెరిగి రూ.1,680 కోట్లుగా నమోదైంది. గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ రెట్టింపై రూ.3లక్షలకు చేరింది. నెలవారీ లావాదేవీలు నిర్వహించే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49 శాతం పెరిగి 7.48 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. పోస్ట్‌పెయిడ్ లోన్లు సంవత్సరానికి 486 శాతం పెరిగగా, పంపిణీ చేసిన రుణాల విలువ ఏడాది క్రితం రూ.447 కోట్లతో పోలిస్తే 656 శాతం పెరిగి రూ.3,383 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల వ్యాపారం బాగా పెరిగిందని Paytm తెలిపింది. జూన్ త్రైమాసికంలో పేటీఎం రూ.5,554 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ పంపిణీ చేసిన రుణాలు రూ.632 కోట్లతో పోలిస్తే రుణ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగింది. వార్షికంగా చూస్తే రుణాల పంపిణీ రూ.24,000 కోట్లుగా ఉంటుందని పేటీఎం పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News