Friday, January 10, 2025

2 శాతం క్షీణించిన పేటిఎం షేరు

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ : పేటిఎం మాతృ సంస్థ 97కమ్యూనికేషన్స్ రెండుశాతం క్షీణించింది. సాఫ్ట్ బ్యాంక్ 4.5శాతం వాటా ఉపసంహరించుకోవడంతో పేటిఎం ఒడుదొడుకులకు గురైంది. బిఎస్‌ఈలో 2.23శాతం తగ్గి ఎన్‌ఎస్‌ఇలో 2.38 శాతం తగ్గి రూ.526.90కు చేరింది. ఒన్ 97కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు గత మే నుంచి తొలిసారి పడిపోయిన మరుసటి రోజే మరో రెండుశాతం క్షీణత నమోదైంది. శుక్రవారం ఉదయం అస్థిరతకు లొనైనా అనంతరం కోలుకుని 0.79శాతం రూ.543.80కు చేరింది. కాగా నేషనల్ స్టాక్ ఎకేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) డీల్ డేటా ప్రకారం ఎస్‌విఎఫ్ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ మొత్తం 2,93,50,000షేర్లను విక్రయించింది. ఇది కంపెనీలో 4.5శాతం వాటాకు సమానం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News