Thursday, March 20, 2025

సమర్థంగా నిర్వర్తిస్తా: శ్రేయస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న ఐపిఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ట్రోఫీ సాధించి పెట్టడమే లక్షంగా ముందుకు సాగుతున్నట్టు ఆ జట్టు కెప్టెన్ శ్రేయ స్ అయ్యర్ తెలిపాడు. పంజాబ్ టీమ్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో తనకు సారథ్య బాధ్యతలు అప్పగించిందన్నాడు. జట్టు యాజమాన్యం ఆశయాలకు తగినట్టుగా టీమ్‌ను ముందుకు నడిపించడమే తన ముందున్న అతి పెద్ద లక్షమన్నాడు. దీని కోసం సర్వం ఒడ్డేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. ఈ సారి ఐపిఎల్‌లో విపరీత పోటీ ఉండడం ఖాయమన్నాడు. ప్రతి జట్టులోనూ ప్రతిభాంతులైన ఆ టగాళ్లురన్నాడు. దీంతో ప్రతి మ్యాచ్ సవాల్ వంటిదేనన్నాడు. సవాళ్లను తట్టుకుని ముందు కు సాగేందుకు తాను సిద్ధమని అయ్యర్ స్పష్టం చేశాడు. ఇక ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగ్గా ఆడడంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. ఐపిఎల్‌లోనూ అదే జోరును కొనసాగిస్తానని పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News