కోల్‌కతా: ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ నయా చరిత్ర సృష్టించింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐపిఎల్‌లో కొత్త రికార్డును లిఖించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (75), సునీల్ నరైన్ (71) విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. తర్వాత క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 18.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, బెయిర్‌స్టోలు విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. ప్రభ్‌సిమ్రాన్ 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 54 పరగులు చేశాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన జానీ బెయిర్‌స్టో 48 బంతుల్లోనే 9 సిక్సర్లు, 8 ఫోర్లతో 108 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శశాంక్ సింగ్ 28 బంతుల్లోనే అజేయంగా 68 పరుగులు చేసి పంజాబ్‌కు సంచలన విజయం అందించాడు.