- Advertisement -
ఐపిఎల్ 2025లో భాగంగా ములాన్ పూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య (103) శతకంతో చెలరేగాడు. ప్రయాంశ్ తోపాటు శశాంక్ సింగ్(52 నాటౌట్) అర్ధ శతకం బాదగా.. మార్కో జాన్సెన్(34 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
- Advertisement -