Sunday, January 19, 2025

ఆత్మవిశ్వాసంతో పంజాబ్

- Advertisement -
- Advertisement -

నేడు చెన్నైతో పోరు

ధర్మశాల: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పంజాబ్ కిం గ్స్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో సిఎస్‌కె టీమ్‌ను వారి సొంత మైదానంలోనే పంజాబ్ ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కిందటిసారి పంజాబ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో చెన్నై ఉంది.

ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. రహానె, రుతురాజ్, శివమ్ దూబె, సమీర్ రిజ్వి, మొయిన్ అలీ, ధోనీ, జడేజా వంటి స్టార్ ఆటగాళ్లతో చెన్నై చాలా బలంగా ఉం ది. శివమ్ దూబె, కెప్టెన్ రుతురాజ్‌లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇది చెన్నైకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. పం జాబ్‌తో పోల్చితే పాయింట్ల పట్టికలో సిఎస్‌కె మెరుగైన స్థానంలో ఉంది. ఇది చెన్నైకి ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న సిఎస్‌కె ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు పంజాబ్ జట్టులో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ప్రభ్ సిమ్రాన్ సింగ్, రిలి రొసొ, బెయిర్‌స్టో, శశాంక్ సింగగ్, శామ్ కరన్, అశుతో ష్ శర్మ, వికెట్ కీపర్ జితేష్ శర్మ తదితరులతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

కిందటి మ్యాచ్‌లో బెయిర్‌స్టో, శశాంక్, శామ్ కరన్, రొసొ తదితరులు అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. శశాంక్, బెయిర్‌స్టో, అశుతోష్‌ల రూపంలో పంజాబ్‌కు విధ్వంసక బ్యాటర్లు ఉన్నారు. ఈ సీజన్‌లో శశాంక్, అశుతోష్‌లు అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనూ జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే ఈసారి కూడా పంజాబ్‌కు విజయం కష్టమేమీ కాదు. మరోవైపు రబడా, అర్స్‌దీప్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, శామ్ కరన్ తదితరులతో పంజాబ్ బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. బౌలర్లు కూడా తమవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. దీనిలో ఏ జట్టుకు విజయం వరిస్తుందో వేచిచూడక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News