నేడు కోల్‌కతాతో కీలక పోరు
చండీగఢ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్‌కు మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే పోరు సవాల్‌గా మారింది. సన్‌రైజర్స్‌పై 245 పరుగుల భారీ స్కోరును సాధించిన పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఇలాంటి స్థితిలో పటిష్టమైన కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా క్లిష్టమైన అంశంగా చెప్పాలి. ఇక కిందటి పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించిన కోల్‌కతా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. సునీల్ నరైన్ ఫామ్‌లోకి రావడం కోల్‌కతాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
బ్యాటింగే బలం..
పంజాబ్‌కు బ్యాటింగే బలంగా కనిపిస్తోంది. కిందటి పోరులో పంజాబ్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు జోరుమీదున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆర్య కళ్లు చెదిరే శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా జోరుమీదున్నాడు. ఈ సీజన్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కోల్‌కతాపై కూడా చెలరేగాలనే లక్షంతో ఉన్నాడు. మరోవైపు కెప్టెన్ శ్రేయస అయ్యర్ ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కు దిగే శ్రేయస పరుగుల వరద పారిస్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిపోరులో శ్రేయస్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ను కనబరిచిన శ్రేయస్ 36 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మరో 6 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. నెహాల్ వధెరా, మాక్స్‌వెల్, స్టోయినిస్. మార్కొ జాన్సెన్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. శశాంక్ సింగ్ రూపంలో మరో విధ్వంసక బ్యాటర్ కూడా అందుబాటులో ఉన్నాడు. బౌలింగ్‌లో కూడా పంజాబ్ బాగానే ఉంది. మాక్స్‌వెల్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్, ఫెర్గూసన్, జాన్సన్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది.
ఆత్మవిశ్వాసంతో..
మరోవైపు కోల్‌కతా ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. సునీల్ నరైన్ ఫామ్‌లోకి రావడం కోల్‌కతాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కెప్టెన్ అజింక్య రహానె జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. డికాక్, నరైప్, రహానె, రింకు సింగ్, వెంకటేశ్ అయ్యర్, రస్సెల్ వంటి ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న కోల్‌కతా ఈ మ్యాచ్‌లో విజయం సాధించడమే లక్షంగా పెట్టుకుంది.