Wednesday, April 16, 2025

చెలరేగిన కోల్ కతా బౌలర్లు.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన పంజాబ్

- Advertisement -
- Advertisement -

పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ కోల్ కతా బౌలర్లు చెలరేగారు. వరుస వికెట్లతో విజృంభించడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య(22), ప్రభుసిమ్రాన్ సింగ్(30)లు శుభారంభం అందించారు. అయితే, వీరిద్దరూ ఔటైన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు.

కోల్ కతా బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో పంజాబ్ కోలుకోలేకపోయింది. ఓపెనర్లు తప్ప మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో పంజాబ్ జట్టు కేవలం 15.3 ఓవర్లలోనే 111 పరుగులకు పరిమితమైంది. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లు చెరో 2 వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News