Monday, December 23, 2024

హైదరాబాద్‌పై పంజాబ్ విజయం

- Advertisement -
- Advertisement -

ముంబయి : సుదీర్ఘంగా సాగిన మెగా టోర్నీ ఐపిఎల్ లీగ్ దశలో ఆదివారం జరిగి న చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పంజాబ్ విజయం సాధించింది. 158 పరుగుల లక్షాన్ని మరో 29 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి సాధించింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లలో లివింగ్ స్టోన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శిఖ ర్ ధావన్ 39, బెయిర్‌స్టో 23,షారుక్ ఖాన్ 19, జితేశ్ శర్మ 19 పరుగులు చేశారు. అం దరు కూడా బంతికో పరుగుకన్నా ఎక్కువే సాధించారు. ఈ విజయంతో పంజాబ్ 14 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో ఆరో స్థానం లో నిలవగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 8వ స్థానానికి దిగజారింది. వరస ఓటములతో ప్లే ఆఫ్స్ రేస్‌నుంచి తప్పుకున్న ఈ రెండు జట్లూ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవడం కోసం మాత్రమే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌తో లీగ్ దశ పోటీలు ముగిశాయి.

తొలుత టాస్ గెలిచి బ్యాట్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేయడంతో హైదరాబాద్ బ్యా టర్లు ధాటిగా పరుగులు చేయలేక పోయా రు. ప్రియమ్ గార్గ్(4), నికొలస్ పూరన్(5) విఫలం కాగా, అభిషేక్ శర్మ(43), రాహుల్ త్రిపాఠి(20), మార్‌క్రమ్(21),వాషింగ్టన్ సుందర్ (25), రొమారియో షెపెర్డ్(26 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. సుందర్, షెపెర్డ్‌లు ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించడంతో హైదరాబాద్ ఓ మోస్త రు లక్షాన్ని పంజాబ్ ఉంచింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్3, హర్‌ప్రీత్ బ్రార్3, కసిగో రబాడఒక వికెట్ పడగొట్టారు. భువనేశ్వర్ కెప్టెన్‌గా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News