Saturday, November 16, 2024

కాంగ్రెస్ పార్టీకి పిసి చాకో రాజీనామా

- Advertisement -
- Advertisement -

PC Chacko resigns from Congress party

త్రిసూర్: కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పిసి చాకో పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కేరళ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారస్థాయికి చేరాయని పిసి చాకో తెలిపారు. కేరళలో కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్(ఏ) గ్రూపులున్నాయన్న ఆయన గ్రూపు రాజకీయాలపై అధిష్ఠానం దృష్టికి తెచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ గ్రూప్ రాజకీయాలను అధిష్ఠానం నియంత్రించలేదన్నారు. గ్రూప్ రాజకీయాలకు అధిష్ఠానం మౌనసాక్షిగా మారిందని, గ్రూపు రాజకీయాలతో విసుగెత్తి రాజీనామా చేస్తున్నానని చాకో వెల్లడించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన ఏడాది నుంచి అధ్యక్షుడిని కూడా ఎన్నుకోలేకపోయారని విమర్శించారు.

PC Chacko resigns from Congress party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News