Thursday, December 19, 2024

బిసిసిఐ ఒత్తిడికి తలొగ్గం.. భారత్ ఎందుకు రాదో చెప్పాలి: పీసీబీ

- Advertisement -
- Advertisement -

వచ్చే ఏడాది పాకిస్తాన్ లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాక్ టీమిండియా పర్యటించే ప్రసక్తే లేదని.. ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌ లో నిర్వహించాలని బీసీసిఐ ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం అంగీకరించడంలేదు. దీంతో టోర్నీ నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ క్రమంలో పీసీబీ ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లోనే జరిగి తీరుతుందని అన్నారు. హైబ్రిడ్ మోడల్‌కు తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘అసలు తమ దేశానికి భారత్ ఎందుకు రాదో లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలి. పాక్‌లో పర్యటించడానికి భారత్‌కు ఏంటీ సమస్య?. ఇకపై బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గం. ఐసీసీ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News