Thursday, December 19, 2024

పాకిస్థాన్ ఘోర పరాజయం.. రమీజ్ రాజాపై వేటు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ రమీజ్ రాజాపై వేటుపడింది. ఇంగ్లండ్‌తో సొంత గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ 0-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్థాన్ ప్రభుత్వం పిసిబి చైర్మన్ రమీజ్ రాజాను పదవి నుంచి తొలగించింది.

రమీజ్ రాజా పిసిబి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్థాన్ జట్టులో అంతర్గత విభేదాలు తలెత్తాయి. పలువురు క్రికెటర్ల మధ్య మనస్పర్థాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో రమీజ్ రాజా ఘోరంగా విఫలమయ్యాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News