తక్కువ సమయంలో ఎక్కువ సొమ్మును కొల్లగొట్టిన చరిత్ర బిఆర్‌ఎస్‌దే
పదేళ్ల పాలనలో ఎన్ని ఎకరాలు డిఫారెస్ట్ చేశారో చెప్పాలి జిహెచ్‌ఎంసి
పరిధిలో 10వేల ఎకరాలకు పైగా విక్రయించిన ఘనత బిఆర్‌ఎస్‌దే
హెచ్‌సియు భూముల్లో కెటిఆర్, బిల్లీరావు మధ్య 30శాతం ముడుపుల
ఒప్పందం ఇప్పుడు అది బెడిసికొట్టడంతో నానా యాగీ
చేస్తున్న బిఆర్‌ఎస్ నేత : పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : గత పదేళ్లలో బిఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసంపై చర్చకు సిద్ధమా అంటూ కెటిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎ న్ని ఎకరాలు డిఫారెస్ట్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం జ రిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ ప్రజా సొ మ్మును కొల్లగొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, డ్రామరావు పేరును కెటిఆర్ సార్థకం చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సియూ భూములపై పూటకో డ్రామా ఆడుతూ కెటిఆర్ ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో పదివేల ఎకరాలకు పైగా భూములు అమ్మిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదని ఆయన తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పక్కల అత్యంత వి లువైన ప్రభుత్వ భూములను వారి అస్మదీయులకు కట్టబెట్టింది వాస్తవం కాదా కెటిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పదేళ్లలో యథేచ్ఛగా భూములు దోపిడీ చేసిన చరిత్ర బిఆర్‌ఎస్ పార్టీదన్నారు.
బిల్లి రావుతో కెటిఆర్ లాలూచీ
హెచ్‌సియూ భూములకు సంబంధించి కెటిఆర్ ఐఎంజీ సంస్థ బిల్లి రావుతో 30 శాతం ముడుపులు మాట్లాడుకొని కుదుర్చుకున్న ఒప్పందమని, ముడుపుల ఒప్పందం బెడిసి కొట్టడంతో కెటిఆర్ ఈ భూములపై నానాయాగి చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. హెచ్‌సియూ భూములు ప్రైవేటు పరంగా కాకుండా కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. హెచ్‌సియూ భూములను అప్పటి ఎన్డీయే ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, అప్పటి సిఎం చంద్రబాబు కలిసి ఐఎంజీ భారత్ కంపెనీకి అప్పగిస్తే కోర్టులో కొట్లాడి అప్పటి సిఎం వైఎస్‌ఆర్ రద్దు చేయించారన్నారు. ఐఎంజీ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా అప్పటి మంత్రి కెటిఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కెటిఆర్‌కు రావాల్సిన రూ.5, 200 కోట్లను కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం బిల్లిరావుకు ఈ భూములను అప్పనంగా అప్పగించేదని ఆయన అన్నారు.
ఏఐ టెక్నాలజీ తో నెమళ్లు, జింకలు రోదిస్తున్నాయని అవాస్తవాలు
హెచ్‌సియూ భూములు ప్రభుత్వానివని, అందుకు బదులుగా 390 ఎకరాలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన తెలిపారు. హెచ్‌సియూ భూములపై కుట్ర పూరితంగానే ఏఐ టెక్నాలజీ తో నెమళ్లు, జింకలు రోదిస్తున్నాయంటూ అవాస్తవాలు ప్రచారం చేశారని, అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, కెటిఆర్ అరెస్టును అడ్డుకుంటుంది ఎవరో అందరికీ తెలుసనీ, కెటిఆర్ జైలుకు పోవడం ఖాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో అరెస్టు అవుతానని కెటిఆర్‌కు తెలుసన్నారు. మంత్రివర్గంలో బిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చించుకొని ముందుకు వెళ్లే వెసులుబాటు కాంగ్రెస్‌లో ఉందని, కాంగ్రెస్‌లో స్వేచ్ఛకు కొదవలేదని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ యూనివర్సిటీల భూముల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మిగతా భూమి పరిరక్షణకు గత ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు?
హెచ్‌సియూ వివాదాస్పద భూమిని మినహాయించి మిగతా భూమి పరిరక్షణకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో కెటిఆర్ సమాధానం చెప్పాలని పిసిసి అధ్యక్షుడు డిమాండ్ చేశారు. బిజెపితో బిఆర్‌ఎస్ అనైతిక బంధం కొనసాగిస్తూ కెటిఆర్ కాంగ్రెస్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. 48 గంటల్లో బిజెపి ఎంపి పేరు బయట పెడతానని చెప్పిన కెటిఆర్ ఎందుకు వెనకడుగేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తే బిఆర్‌ఎస్, బిజెపిలు కుమ్మకై రెండు పార్టీల నేతలు హాజరుకాలేదని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి గతంలో బిఆర్‌ఎస్ చేసిన పాపాలే ఇప్పుడు శాపం అయ్యాయని ఆయన ఆరోపించారు.