బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్‌ఫ్లాప్ ప్రభుత్వ
అభివృద్ధి కార్యక్రమాలను చూసి కెసిఆర్ గుండెల్లో
గుబులు అభివృద్ధిపై చర్చకు కెసిఆర్ సిద్ధమా?
పిసిసి చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్
మనతెలంగాణ/హైదరాబాద్:తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం కెసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని పిసిసి చీ ఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిడుతూ ఆదివారం జరిగిన బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. తెలంగాణకు ఫస్ట్ అండ్ లాస్ట్ విలన్ కెసిఆర్‌అని విమర్శలు చేశారు. కాంగ్రెస్ బిక్షతో కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి కెసిఆర్‌కు గుండెల్లో గుబు లు మొదలయ్యిందన్నారు. 420 హామీలంటూ విమర్శిస్తున్న కెసిఆర్ మీ పదేళ్ల బిఆర్‌ఎస్ పాలన, 15 నె లల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు. టైం, వేదిక మీరే డిసైడ్ చే యాలని, చర్చకు ఎక్కడికి రమ్మంటే అయ్యిందని జ న్వాడలో ఉన్న ఫాంహౌస్‌లు ఎవరివని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ శకం ముగిసింది
రజతోత్సవ సభలో జనాల కంటే విస్కీలు ఎక్కువ ఉ న్నాయని, అసలు ఈ సభలో అసలు మహిళలే కనిపించలేదని పిసిసి అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. కెసిఆర్ ప్ర సంగంలో పసలేదని ఇక తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ శకం ముగిసిందని ఆయన ఆరోపించారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కు టుంబాన్ని నకిలీ గాంధీలు అనడం కెసిఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అని, కెసిఆర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. గాంధీ కు టుంబం పెట్టిన రాజకీయ బిక్షతోనే కెసిఆర్ కుటుం బం లక్షల కోట్లకు పడగలెత్తిందని ఆయన ధ్వజమెత్తా రు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు మ్యాచ్ ఫిక్సింగ్ అనడానికి ని దర్శనం బిజెపిపై కెసిఆర్ చేసిన రెండు నిమిషాల ప్ర సంగమే దానికి సాక్షమని ఆయన పేర్కొన్నారు. బిజెపిపై కెసిఆర్ విమర్శలు నెమలి పింఛంతో కొట్టినట్లు ఉందన్నారు. కెసిఆర్ ప్రసంగంలో బిజెపి, బిఆర్‌ఎస్ లు ఒక్కటేనని మరోసారి రుజువైందన్నారు. బిసి కులగణన, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ చట్టంపై కెసిఆర్ ఎందు కు నోరు మెదపడం లేదన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు కుట్రపన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
మూడు ముక్కలాటతో మతి భ్రమించింది
కెటిఆర్, హరీష్ రావు, కవితలు ఆడుతున్న మూడుముక్క లాటతో కెసిఆర్‌కు మతి భ్రమించిందని ఆయన ఆరోపించారు. కుటుంబ కొట్లాటలు వేగలేకనే రజతోత్సవ సభ పేరిట కెసిఆర్ హంగామా చేసినా ప్రయోజ నం లేకుండా పోయిందన్నారు. వేదికపై కెసిఆర్, కెటిఆర్ ఫ్లెక్సీలతో అల్లుడు హరీష్, కూతురు కవిత మనసు కి మరోసారి గాయమైందన్నారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పా లనలో కెసిఆర్ కుటుంబం దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దోచుకున్న కుటుంబం కెసిఆర్‌దన్నారు. గత ప్రభుత్వ హయంలో తెలంగాణ అన్ని రంగాల్లో విధ్వ ంసం జరిగిందన్నారు. పార్టీ పేరులోంచి తెలంగాణ ప దాన్ని తొలగించిన కెసిఆర్‌కు ఇప్పుడు జన్మభూమిని గుర్తుకు వచ్చిందా అని ఆయన సెటైర్‌లు వేశారు. తె లంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవడం కెసిఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కెసిఆర్‌కు లేదని అన్నారు.