Saturday, December 21, 2024

నేడు గ్రూప్1పై సర్కార్ కీలక ప్రకటన..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్1 అభ్యర్థుల డిమాండ్‌పై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఉన్నతాధికారులతో పలువురు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ సమావేశమయ్యారు. గ్రూప్1 అభ్యర్థుల డిమాండ్లపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు.

సమావేశంలో ప్రధానంగా గ్రూప్1 మెయిన్స్ పరీక్ష, జివో 29 అంశంపై చర్చించారు. గ్రూప్1 వాయిదా సాధ్యాసాధ్యాలపై సైతం సుదీర్ఘంగా చర్చ కొనసాగించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు. ఏ ఒక్క అభ్యర్థి నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా చర్చ కొనసాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News