Wednesday, January 22, 2025

ఆ నేతలే పెత్తనం చెలాయించారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే తెలగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇబ్బంది పెట్టారన్నారు. రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారని ఆరోపించారు. స్వేచ్చ, సామాజిక న్యాయం, అభివృద్ధి.. రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణ.. ఒక్క వ్యక్తి ఉక్కు పాదాల కింద నలిగిపోతుందని రేవంత్ పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నదని కాంగ్రెస్ నమ్మిందన్నారు. ధర్మం వైపు నిలబడటం వల్లే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News