Wednesday, January 22, 2025

కెసిఆర్‌.. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిండు: మహేష్ గౌడ్

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్: ముఖ్యమంత్రి కేసిఆర్ నిరంకుశ పాలనతో కోట్ల రూపాయలు కొల్లగోట్టాడని, రాష్ట్ర రాజకీయాలు కలుషితం చేసిండని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం షాద్‌నగర్ మున్సిపల్‌లోని 3, 4వ వార్డులో టిపిసిసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హత్ సే హత్ జోడో పాదయాత్రకు ముఖ్య అతిదిగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రమని చెప్పిన ముఖ్యమంత్రి 8ఏళ్ల కాలంలో ఐదున్నర లక్షల కోట్ల అప్పులు ఎలా చేశారని ప్రశ్నించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.120కోట్లు కేటాయించి రూ.5లక్షల కోట్టు కమీషన్ల రూపంలో దండుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి, బిఆర్‌ఎస్ అంతర్గత ఒప్పందాలకు సిద్దమై ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాయని, ఒక్కొ నియోజకవర్గంలో రూ.200కోట్ల నుంచి రూ. 300కొట్లు ఖర్చు పెట్టుందుకు సిద్దమవుతున్నాయని వివరించారు.

కాంట్రాక్ట్ కమీషన్లతో వేల కోట్లు దోచుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వేల కొట్లు పెట్టి ఎన్నికల్లో గెలుచేందుకు సిద్దమవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, బిజెపికి ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే సిట్లు రావాని జోష్యం చెప్పారు. బిఆర్‌ఎస్, బిజెపి ఇచ్చే డబ్బులను ఓటర్లు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. షాద్‌నగర్ మున్సిపాలిటిలోని అన్ని వార్డులో కాంగ్రెస్ విజయం సాధించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు భూ దందాలు చేసి వేల కోట్లు సంపాధించారని, దాంతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం పూర్తిగా మరచిపోయారని వివరించారు.

తెలంగాణ రాజకీయాలను బిఆర్‌ఎస్ పూర్తిగా కలుషితం చేసిందని, ఈ పాపం ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు. నిరంకుశ పాలనతో వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. 16వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్టాన్ని ఐదున్నర లక్షల కోట్ల రూపాయాల అప్పులు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని, ప్రజలను మభ్యపెట్టుందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీల వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News