Wednesday, January 22, 2025

అధిక బరువుతోనే మహిళ్లలో పిసిఓఎస్

- Advertisement -
- Advertisement -

జీవనశైలి మార్పులతో తగ్గించుకునే అవకాశం
ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలంటున్న వైద్యులు

హైద్రాబాద్ : పోషకాహార లోపంతో పలు రకాల వ్యాధులకు కారణ అవుతుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్(పిసిఓఎస్) అనే సమస్య కూడా అధిక బరువుతో వస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో శరీరంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. నేటి అధునిక జీవనశైలిలో శారీరక వ్యాయామం తగినంతగా లేకపోవడం, దానికితోడు జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడంతో స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయని వెల్లడించారు. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, ఇతర చర్యల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని సెంచురీ ఆసుపత్రి నిర్వహించిన ఉచిత శిభిరంలో ప్రముఖ పోషకాహార నిపుణులు డా. తరణి నాయుడు వివరించారు.

శిబిరంలో ఎవరి శరీరానికి ఎలాంటి ఆహారం, ఎంత మోతాదులో తీసుకోవాలనే అంశాలను సూచించారు. ప్రీ లైప్ స్టైల్ మాడికేషన్ ప్రొగ్రామ్‌లో భాగంగా రూ. 2వేల విలువ చేసే డైట్ ప్లాన్, డైటీషియన్ కన్సల్టేషన్ ఉ చితంగా అందించినట్లు తెలిపారు. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్, కిడ్నీ వంటి వ్యాధులలో ఆహారమే ప్రధాన పాత్ర ను పోషిస్తుందన్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు ఆరోగ్య సమస్యలన్నింటినీ నియంత్రించే అవకాశాలు ఉన్నాయని సూచించారు. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో సమతుల్యతను పాటిస్తూ అన్ని పదార్ధాలనూ తీసుకోవాలని తరణి నాయుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News