- Advertisement -
మనతెలంగాణ, సిటిబ్యూరోః కూతురి పుట్టిన రోజు వేడుకలు వృద్ధాశ్రమంలో జరిపి తన సేవాభావాన్ని చాటాడు కానిస్టేబుల్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో రవి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే రవి కూతురు సోనిది ఆదివారం పుట్టిన రోజు కావడంతో వృద్ధాశ్రమంలో జరుపాలని అనుకున్నాడు. దీంతో మియాపూర్‌లోని వివేకానంద సేవా ఆశ్రమంలో ఉన్న 100మంది వృద్ధులకు అన్నదానం, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశాడు. అక్కడే కూతురితో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకలు చేయించారు.
- Advertisement -