Monday, December 23, 2024

రైల్వే ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పిడి యాక్ట్

- Advertisement -
- Advertisement -

PD Act against man cheats in name of railway jobs

ఆదేశాలు జారీ చేసిన సిపి మహేష్ భగవత్

హైదరాబాద్: రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిపై పిడి యాక్ట్ పెడుతూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. సికింద్రాబాద్, కార్ఖనాకు చెందిన పొన్నాల భాస్కర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది మందితో కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు నిరుద్యోగులకు రైల్వే, ఎఫ్‌సిఐ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారు. వచ్చిన డబ్బులతో నిందితులు జల్సాలు చేశారు. రైల్వే గ్రూప్ సి ఉద్యోగం కోసం రూ.10లక్షలు, గ్రూప్ డికి రూ.6లక్షలు, సిబ్యూసి గ్రూప్ సికి రూ.8లక్షలు, గ్రూప్ డికి రూ.7లక్షలు వసూలు చేశారు. తర్వాత యువకులకు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు, వాటిని తీసుకుని వెళ్లిన బాధితులకు అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా పిడి యాక్ట్ పెడుతూ సిపి మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News