Thursday, April 3, 2025

రేషన్ బియ్యం దందా చేస్తే పిడి యాక్ట్ ప్రకారం కేసులు: రఘునందన్

- Advertisement -
- Advertisement -

చింతపల్లి: రేషన్ బియ్యం దందా చేస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం ఆయన చింతపల్లిలో రహస్యంగా దాచి ఉంచిన రేషన్ బియ్యం నిల్వల గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం ఖాయం అని హెచ్చరించారు. సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని పౌర సరఫరాల సంస్థ నాంపల్లి పౌర సరఫరాల సంస్థ గిడ్డంగికి తరలించారు. రేషన్ బియ్యంను తూకం చేసే ఎలక్ట్రానిక్ కాంటను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు కొట్టే వెంకటేష్, చింతపల్లి పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News