Wednesday, January 22, 2025

గంజాయి స్మగ్లర్లపై పిడి యాక్ట్

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రకు చెందిన అలీసాగర్ సఫీయుద్దిన్ రాంపూర్వాల, బిల్కీస్ మహ్మద్ సులేమాన్, ముర్తజా షేక్ అలియాస్ శాభాజ్ కలిసి గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ముగ్గురు నిందితులు 110కిలోల గంజాయిని ఇన్నోవా వాహనంలో పెట్టుకుని ఎపిలోని అరకు నుంచి మహారాష్ట్ర, ముంబాయికి తరలిస్తుండగా అఫ్జల్‌గంజ్ పోలీసులు పట్టుకున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి జైలులో ఉన్న నిందితులపై పిడి యాక్ట్ పెడుతూ హైదరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News