Friday, November 22, 2024

పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తి హౌస్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులో 370వ అధికరణను రద్దు చేసి నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా శనివారం తనను, తన పార్టీ నాయకులు కొంవదరిని పాలకులు గృహ నిర్బంధం చేశారని మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి వెల్లడించారు.

అర్ధరాత్రి నుంచి తన పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారంటూ ఆమె శనివారం ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీరులో శాంతి భద్రతల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వాదన బూటకమని తమ అరెస్టుతో తేలిపోయిందని ఆమె పేర్కొన్నారు.

370వ అధికరణ రద్దు వాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు సంబరాలు జరుపుకోవాలంటూఒకపక్క భారీ హోర్డింగులను ఏర్పాటు చేసిన పాలకులు మరోపక్క కశ్మీరీ ప్రజల మనోభావాలను అణచివేయడానికి కిరాతకంగా బలప్రయోగం ఉపయోగిస్తున్నారని ఆమె ఆరోపించారు. 370వ అధికరణ రద్దు చట్టబద్ధతపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆమె అర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News