Tuesday, November 5, 2024

ఆస్తిపన్నుకు వ్యతిరేకంగా కశ్మీర్‌లో పిడిపి నిరసన

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్‌లో ఆస్తిపన్ను విధించడానికి వ్యతిరేకంగా, దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిడిపి) శనివారం నిరసన ర్యాలీ నిర్వహించింది. కేంద్ర పాలిత పాలకవర్గం మంగళవారం మున్సిపల్ ఏరియాలో ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను విధిస్తూ ఉత్తర్వు జారీచేసింది. ప్రతి ఏడాది నివాస ఆస్తుల విలువ ఆధారంగా ఐదు శాతం, వాణిజ్యపరమైన ఆస్తుల విలువ ఆధారంగా ఆరు శాతం ఆస్తి పన్నును వసూలుచేయనున్నారు.

దీనిని నిరసిస్తూ పిడిపి కార్యకర్తలు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి పార్టీ ప్రధాన ప్రతినిధి సుహైల్ బుకారీ నేతృత్వం వహించారు. షేర్‌ఇకశ్మీర్ పార్క్ వద్ద ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆస్తిపన్నును వెనక్కి తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. నిరసనకారులు నగరంలోని లాల్‌చౌక్ వరకు నిరసన ర్యాలీ కొనసాగించాలనుకున్నారు. కానీ వారిని ట్రాఫిక్ ప్రధానకార్యలయం వ్ద పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత వారు అక్కడి నుంచి వెనక్కి తగ్గి చెల్లాచెదరైపోయారు.

ఈ సందర్భంగా బుఖారి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రజలను ఆర్థికంగా బలహీనపర్చాలని చూస్తోందన్నారు. ‘ముందు మా రాజకీయ హక్కులు హరించారు, తర్వాత ప్రజాస్వామ్యాన్ని పాతేశారు, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను, పేదలను వేధించారు, ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చారు, ఇప్పుడేమో ఆస్తి పన్ను విధిస్తామంటున్నారు. గత ఐదేళ్లలో కశ్మీర్ ప్రజల ఆర్థిక స్థితి బాగా దిగజారింది. ఉద్యోగాల కల్పన లేదు, పారిశ్రామిక రంగం బలహీనమైపోయింది’ అని వివరించారు. పాలకవర్గం ప్రజలకు చేయందించాల్సిందిపోయి, దానికి భిన్నంగా బిజెపి ప్రభుత్వం ప్రజలకు మరిన్ని వెతలు కల్పించాలనుకుంటోంది’ అన్నారు. ఆస్తిపన్ను నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News