Sunday, April 13, 2025

అది అనేది జీవితంలో భాగమైంది: రకుల్ ప్రీత్ సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు. షూటింగ్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి కనిపించదని, విరామ సమయాల్లోనే ఒత్తిడికి గురవుతానని వివరణ ఇచచారు. తన 16 కెరీర్‌పై రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో ముచ్చటించారు. ప్రతి రోజూ షూటింగ్‌కు వెళ్లడం కెమెరాను ఎదుర్కొడం అనేది జీవితంగా భాగంగా మారాయని, ఈ హార్డ్ వర్కే తనని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తుందని, ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని రకుల్ కోరుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు జీవితంలో భాగమేనని, కెరీర్‌లో స్థిరపడే కొద్దీ ఎన్నో మార్పులు వస్తాయని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా రెట్టింపు ఉత్సహంతో పని చేయాలని, నమ్మకంతో పని చేస్తే విజయం వరిస్తుందని తెలియజేశారు.

తన సినీ కెరీర్ ‘గిల్లీ’ అనే కన్నడ చిత్రంలో ప్రారంభించి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తన హవా కొనసాగిస్తోంది. నితీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామయణలో రకుల్ శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు. ‘దేదే ప్యార్ దే 2’లో అజయ్ దేవ్‌గణ్, మాధవన్‌లతో జంట ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ మూవీకి ఆమె భర్త జాకీ భగ్నానీ నిర్మాత వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News