Monday, January 20, 2025

ఆనందం వర్ధిల్లిన చోటనే అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ఆనందంగా ఉండటం కోసమే మనం కలలు కంటాం. లక్ష్యాల సాధన దిశగా నిరంతరం కృషిసల్పుతుంటాం. అయితే, జీవన సంక్లిష్టతల మూలంగా ఆనందం ఎప్పటికప్పుడు ఎండమావే అవుతుంది. అందుకని మనలో చాలామందిమి ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆనందం సిద్ధించదని భావిస్తుంటాం. ఆ అద్భుతం జరగడం కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. తరగని ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, ఇంకేవో లాభదాయక వనరులుంటేనో ఆనందంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే అది పెద్ద భ్రమ. నిజం చెప్పాలంటే మనిషి ఆనందంగా ఉండడానికి పెద్ద పెద్ద విషయాలతో సంబంధమే లేదు. మనం ఎవరమైనా చేసే పని ఏదైనా, పని చేసే విధానం, ఆ పని విధానాన్ని ప్రభావితం చేసేటువంటి స్వల్ప మానసిక మార్పులు చేసుకుంటే చాలు. మరో చోటు నుంచి ఎక్కణ్ణుంచో సంతోషం రాదు, ఆనందాన్ని ఎవరో మనకు తేనెపట్టులా తెచ్చివ్వరు.ఆనందం ఎవళ్లకు వాళ్లం సృష్టించుకోవాల్సిన ఒక వాతావరణం. ఆహారం మాదిరిగానే ప్రతి వ్యక్తికీ హ్యాపీనెస్ రోజువారీ కనీస అవసరం. హ్యాపీనెస్ ఉంటేనే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆనందాన్ని పొందేందుకు ప్రతి నిమిషం ఎవళ్లకువాళ్లు ప్రయత్నించాలి.

‘The peace of mind knowing that you did your best to become the best you are capable of’ –John Wooden, American Basketball Coach.‘Positive psychology takes you through the countryside of pleasure and gratification, up into the high country of strength and virtue, and finally to the peaks of lasting fulfillment, meaning and purpose’ –Martin Seligman , American Psychologist

‘ఆనందో బ్రహ్మ’ అనే సూక్తి, ‘సంతోషమే సగం బలం’ అనే సామెత. ‘ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ సినిమా పాట అందరికీ తెలుసును. ఇప్పుడీ మూడింటి ప్రస్తావన ఎందుకు అంటే ప్రస్తుతం ‘పని చేసే చోట్ల ఆనందం ( Happiness at Workplace)’ అనే విషయం మీద సీరియస్ గా చర్చ జరుగుతోంది. మాన్యుఫాక్చరింగ్, మేనేజ్‌మెంట్, సర్వీస్ సెక్టార్లలో ఆనందంగా ఉండటం, ఆనందంగా ఉంచటం విషయమై ప్రపంచ వ్యాప్తంగా సెమినార్లు, ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఉద్యోగులకు, వృత్తిదారులకు క్షేత్రస్థాయిలో లభించే ఆహ్లాదంతో, ఆనందంతో, అక్కడే వాళ్ల ఉత్పాదకతా సేవల సామర్థ్యం ముడివడి ఉందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అధ్యయనాలు చెప్పడమే కాదు, ఇదే నిజం కూడా. అందుకే మెరుగైన సేవలు, ఉత్పాదకత కోసం తమ సిబ్బందిలో మానసిక ఆరోగ్యాన్నిపెంపొందించే ‘హ్యాపీనెస్ కోచ్’లను సైతం ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు నియమించుకుంటున్నాయి. వర్క్ ఫోర్స్ తమ జీవితం గురించి మెరుగైన దృక్పథాన్ని అలవరచుకునేందుకు, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి సహిత సంతృప్తితో నింపుకునేందుకు హ్యాపీనెస్ కోచ్‌లు సంస్థాగతంగాసాయపడతున్నారు. ప్రతీ ఏటా దేశవిదేశాల్లో కార్పొరేట్ సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘హ్యాపీనెస్ ఫెస్ట్’లను గమనిస్తే కార్ఖానాల్లో, కార్యాలయాల్లో వెల్లివిరియాల్సిన సుహృద్భావం పనిచైతన్యం వెరసి ఆనందపరిసరం (Happiest Environment) ఇప్పుడు ఎంతటి ప్రాముఖ్యత కలుగుతున్నదో తెలుస్తుంది.
హ్యాపీనెస్ విషయమై మన దేశం గురించి ప్రత్యేకించి చెప్పాల్సివస్తే ముంబైలోని Happiitude అనే కన్సల్టెన్సీ ఆయా కంపెనీలకు అవసరమైన హ్యాపీనెస్ కోచ్‌లను అందిస్తున్నది. ‘Happiit ude brings you effective tools, methodologies and frameworks designed around the science of happin ess to create a sustainable culture that will ignite passion, growth, and success at your workplace’ అనే చేతనావర్తనకు Happiitude పేరుబడింది. ఇండియా టుడే వార పత్రిక గత ఫిబ్రవరి మాసంలో నిర్వహించిన ‘India Today RPG Happiness Fest’ తను ప్రతిష్ఠా వాక్యంలో ‘ Where face meets smile, mind meets ease, heart meets music’ అంటూ దేశ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫోర్స్‌లో పనిశక్తిని, పనిస్ఫూర్తిని రగిలిస్తూ ఆనందం అవసరాన్ని అత్యంత మధురంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇక ఆనందం విషయానికొస్తే మనలో ప్రతిఒక్కరమూ ఆనందంగా ఉండేందుకు ఇష్టపడతాం. ఆనందంగా ఉండటం కోసమే మనం కలలు కంటాం. లక్ష్యాల సాధన దిశగా నిరంతరం కృషిసల్పుతుంటాం. అయితే, జీవన సంక్లిష్టతల మూలంగా ఆనందం ఎప్పటికప్పుడు ఎండమావే అవుతుంది. అందుకని మనలో చాలామందిమి ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆనందం సిద్ధించదని భావిస్తుంటాం. ఆ అద్భుతం జరగడం కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. తరగని ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, ఇంకేవో లాభదాయక వనరులుంటేనో ఆనందంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే అది పెద్ద భ్రమ. నిజం చెప్పాలంటే మనిషి ఆనందంగా ఉండడానికి పెద్ద పెద్ద విషయాలతో సంబంధమే లేదు.

మనం ఎవరమైనా చేసే పని ఏదైనా, పని చేసే విధానం, ఆ పని విధానాన్ని ప్రభావితం చేసేటువంటి స్వల్ప మానసిక మార్పులు చేసుకుంటే చాలు. మరో చోటు నుంచి ఎక్కణ్ణుంచో సంతోషం రాదు, ఆనందాన్ని ఎవరో మనకు తేనెపట్టులా తెచ్చివ్వరు.ఆనందం ఎవళ్లకు వాళ్లం సృష్టించుకోవాల్సిన ఒక వాతావరణం. ఆహారం మాదిరిగానే ప్రతి వ్యక్తికీ హ్యాపీనెస్ రోజువారీ కనీస అవసరం. హ్యాపీనెస్ ఉంటేనే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆనందాన్ని పొందేందుకు ప్రతి నిమిషం ఎవళ్లకువాళ్లు ప్రయత్నించాలి. అరిస్టాటిల్ మహానుభావుడు ఆనందం గురించి ఒక గొప్ప మాట అన్నాడు. అదేంటంటే ‘మనిషి ఉనికి ఉద్దేశం, లక్ష్యం, జీవితాన్ని అర్థవంతంగా సాగించడమే. ఆనందంగా ఉండడమే’.
మనుషులందరి దైనందిన జీవితం సవాలక్ష సమస్యలతో నిండి ఉంటుంది.

ఎవరూ ఖాళీగా ఉండరు. చౌరస్తా దగ్గర ట్రాఫిక్ వలె హడావిడిగా దొర్లిపోయే బిజీ లైఫ్‌లో ఆనందాన్ని పొందడం ఎలా? Happiitude చెబుతున్నట్టు మనకి ఆనందాన్ని ఇచ్చే ఎన్నో సామర్థ్యాలు మన లోపలనే అనేకం నిక్షిప్తమై ఉన్నాయనుకుంటే వాటిని వెలికితీసి వినియోగించుకోవడం ఎట్లా? అందుకే సైకోథెరపిస్టుల ద్వారా, చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ల నుండి వివిధ రంగాల్లో పని చేసే ప్రొఫెషనల్స్ ఉద్యోగులు తప్పక సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఉత్తమ జీవితాన్ని గడపడం, అభివృద్ధి చెందడం, స్వీయ -వాస్తవికత ఈ మూడూ ఆనందం అనే భావనలో గుర్తుకు వచ్చే ముఖ్యమైన పదాలు. ఇప్పుడా అప్పుడా సృష్ట్యాది నుంచి ఉల్లాసపూరితమైన, ఉత్తేజకరమైన, ఉత్తమమైన జీవితం గడిపేందుకు మానవాళి ప్రయత్నిస్తూనే ఉంది. కాకపోతే విషాదానికి విషాదానికి మధ్య విరామాన్నే ఆనందం అంటున్నామే తప్ప నిర్విరామ ఆనందం ఎవరికీ సాధ్యపడిందీ ఎప్పుడూ లేదు. అందుకే ఆనందానికి ఖచ్చితమైన నిర్వచనం ఏదీ పేర్కొనబడలేదు.

పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడమో, లేదంటే పరిస్థితులకు అనుగుణంగా నడచుకోవడమో చేస్తే గనక పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ రెండు పద్ధతుల్లో ఏదో ఒకదానిలో ఇమడలేని పక్షంలో ఆ ఉద్యోగి ఆనందంగా పని చేస్తున్నాడని నిర్ధారించలేం. ఇదే సందర్భంలో ఆనందంగా లేనపుడు ఉద్యోగి అందించే వస్తు సేవల్లో నాణ్యతను కోరుకోవడం వినియోగదారులదే కాదు యాజమాన్యాలదీ దురాశే అవుతుంది. అందుకే ఇప్పుడు రిలయన్స్, విగార్డ్, సియట్, సిస్కో, ఇన్ఫోసిస్, మహింద్రా & మహింద్రా, టాటా సన్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్,అడోబ్ సిస్టమ్స్ వంటి బడా వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ తమ ప్రాంగణాల్లో తమ మనుగడకూ అభివృద్ధికి కారకాలైన ఆహ్లాదకరమైన పరిస్థితుల కల్పనకు శ్రీకారం చుట్టాయి. ఉద్యోగులను ప్రతికూల భావోద్వేగాల నుండి తప్పించేందుకు ప్రత్యేక శిక్షణా శిబిరాలను ప్రారంభించాయి. Father of happiness గా కొనియాడబడుతున్న సుప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు డా. మార్టిన్ సెలిగ్మాన్ రచన ‘సానుకూల మనస్తత్వ శాస్త్రం (Positive Psychology)’ లో పేర్కొనబడ్డ పరిష్కారాల వైపు దృష్టి సారించాయి.

ఉద్యోగుల్లో సానుకూల భావోద్వేగాలను నెలకొల్పే దిశగా డా.సెలిగ్మాన్ చెప్పిన ‘PERMA’ మోడల్ ను అనుసరిస్తున్నాయి. మానవ శ్రేయస్సు (Human Well being), వృద్ధి (Flourishing)ని సంకల్పించి డా.సెలిగ్మాన్ ’ పెర్మా’ను రూపొందించాడు. Positive emotion, Engage ment, Relationships, Meaning, Accomplishment అనే ఐదు విషయాల సమ్మేళనం పెర్మా. డా.సెలిగ్మాన్ సైంటిఫిక్ గా ప్రకటించిన పెర్మాలోని ఐదు విభాగాలకు అదనంగా ‘Health’ అనే విభాగాన్ని ఇటీవల పరిశోధకులు జోడించారు. దీనితో PERMAకు పరిపూర్ణత ప్రాప్తించి PERMAH ఏర్పడింది.మనోనిగ్రహాన్ని సాధించడానికి నిండైన మనసుతో సరైన సమతుల్యతను పాటించడమే ‘సానుకూల ఉద్వేగం (Positive Emotion)’. మనకు ఉన్న శక్తిని మరింత పెంపొందించుకోవడానికి మంచి పనులలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండడమే’ నిశ్చిత కార్యం (Engagement)’. మానవుడు సంఘజీవి. శక్తి సమకూర్పుకు, ప్రసరణకు, మానవ సంబంధాలు కీలకమైనవి సంబంధాలు, అందునా సత్సంబంధాల ప్రామాణిక సంబంధాల స్థాపనే (Relationships) విభాగపు సహకారం.

భావన చేతన అర్థవంతంగా ఉండాలనేది ‘అర్థం (Meaning)’ విభాగం ప్రవచిస్తుంది. సాధన, ఫలసిద్ధి కార్యనిర్వహణా సామర్థ్యాన్ని అనుసరించి ఉంటాయి. కూరిమితో, ఓరిమితో చేసే ఏ కార్యమైనా ఫలప్రదం కాగలదనే నమ్మకాన్ని’ సాఫల్యం (Accomp lishment)’ విభాగం ఎరుకపరుస్తుంది. డా.సెలిగ్మాన్ థియరీకీ అదనంగా చేర్చిన ‘ఆరోగ్యం (Health)’ విభాగం ఉద్యోగి పనిగంటలను ప్రభావితం చేయగలదన్న మానసిక నిపుణుల ప్రతిపాదనను నాయకత్వ శిక్షకురాలు Dr. Michellemcquid సమర్థించింది. ఇందుకు మంచి ఆహారం సరిపడా తీసుకోవడం, రాత్రి గాఢంగా నిద్రపోవడం, ఉదయాన్నే క్రమతప్పకుండా వ్యాయామం చేయాలని ఆరోగ్య విభాగం ఉద్యోగులందరికీ విశదపరుస్తుంది. నవకల్పనా విశ్లేషకులు టోనీ ఉల్విక్ తన ‘Jobs To Be Done’ గ్రంథంలో సూత్రీకరించిన బృహత్తర విధి నిర్వహణకు, మార్కెట్‌లో పోటీని తట్టుకుంటూ కస్టమర్‌ల ఆస్వాదనను గమనించగలిగే దూర దృష్టికి, ఆవిష్కరణలను మరింత ఊహాజనితంగా, లాభదాయకంగా మార్చే చోదక శక్తికి పెర్మా ఇప్పుడు పెట్టింది పేరు.

ఐన్‌స్టీన్ తన ఆలోచనలను ప్రయోగాలుగా మార్చడంలో నిమగ్నమైనప్పుడు తనకు తాను కాంతి పుంజం మీద స్వారీ చేస్తూ విశ్వంలో ప్రయాణిస్తున్నట్లు భావించుకునేవాడని వింటాం. ఈ దృక్కోణం నుండే ఐనిస్టీన్ కొత్త లెన్స్ ద్వారా విశ్వాన్ని వీక్షించగలిగాడు, విషయాలను విభిన్నంగా అర్థవంతంగా దర్శించగలిగాడు. అందుకే అనితర సాధ్యమైన సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని అభివృద్ధి చేశాడు. పెర్మా ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ జమిలి అన్ని సంస్థలకూ ఐనిస్టీన్ తరహా ఆలోచనలకు కేంద్రంగా మారుతున్నది. అస్తవ్యస్త సమాజంలో, వ్యాపార సంక్లిష్టతలు రాజ్యంచేస్తున్న ఈ కష్టసమయంలో అటు సంస్థలకు, ఇటు ఉద్యోగులకు పెర్మా సంరక్షణిగా నిలుస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం పని సమూహాల ఆరోగ్యానికే ప్రాధాన్యతనిస్తూ ‘పూర్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి’గా ఆరోగ్యాన్ని నిర్వచించింది. ఈ నేపథ్యంలో పెర్మాను కంపెనీలన్నీ ‘శ్రేయో చక్రం (Wheel of Well being)’గా విశ్వసిస్తున్నాయి.

పని సమూహాలు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి, వారి స్వీయ ప్రత్యేకతల నుండే శ్రేయస్సును పొందడానికి, తమ విలువల ఆసక్తులకు పెర్మా ఉద్దీపననిస్తోంది. పనితీరూ ఉత్పాదకతా శ్రేయస్సుతో అనుసంధానమై ఉన్నందున శ్రేయో కల్పన కోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ ఆ కంపెనీలు ఐదున్నర రూపాయిల వరకు వస్తు సేవలపై ప్రయోజనం పొందుతున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా అనారోగ్యం వల్ల తలెత్తే గైర్హాజరు అనే సమస్య కంపగనీల్లో సమసి పోతున్నది. ఉద్యోగుల క్షేత్ర స్థాయిలోని ఆనందం గురించి ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు సునీతా భుయాన్ వ్యక్తపరచిన ‘A work place is like an orchestra where employees need to be happy and composed professionals. Performance and productivity are by products of happiness’ ముమ్మాటికీ సత్యమే. మరెందుకు ఆలస్యం? పెర్మాతో ముందడుగుకు అన్ని చోట్లా అందరమూ సిద్ధపడదాం, ఆనందం అభివృద్ధి రెంటినీ జెండాకుట్టి ఉద్యోగుల ఇండ్లపై, సంస్థల ముఖ ద్వారాల్లో ఎగరేద్దాం.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News