Wednesday, January 22, 2025

జీవితంలో మనశ్శాంతి ఎంతో ముఖ్యం

- Advertisement -
- Advertisement -
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భముగా ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ, హైదరాబాద్ వారు దాదాపు 120 మంది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ఉద్యోగినీ, ఉద్యోగులకు రాఖీలు కట్టారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జీవితంలో ప్రతి వ్యక్తికి మనశ్శాంతి ఎంతో ముఖ్యమైనదని, కొందరిలో పని వత్తిడి వల్ల కోపం, బాధ వంటివి కలుగుతాయని, వాటి వల్ల సంతోషాలకు దూరమవుతామన్నారు.

ఎంత పేరు ప్రతిష్టలు, ఆస్తి వున్నా మనశ్శాంతి లేనిదే అవన్నీ వ్యర్థంమన్నారు. ప్రతి ఉద్యోగి రోజులో కొంత సమయాన్ని మెడిటేషన్‌కు కేటాయించాలని సూచించారు.దీని వల్ల కోపం, బాధ వంటి భావాలు మన నుండి దూరమై మన శ్శాంతి కలుగుతుందని అన్నారు. అనంతరం ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయ,హైదరాబాద్ ఇన్ చార్జ్ బ్రహ్మ కుమారి అంజలి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన ద్వారా ప్రతి వ్యక్తి తమకు తాము పరివర్తన చెందే విధంగా తాము సహాయపడతా మన్నారు. ప్రతి వ్యక్తికి సమస్యలు వుంటాయని వాటిని అధికగమించి శాంతిపూర్వక జీవితం పొందటానికి మెడిటేషన్ ఉపయోగ పడుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారి సుజాత, రమేష్ కుమారు,అరుణ్ భాయ్, సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్ గారు, జె శ్రీనివాస్ రెడ్డి ,జి పర్వతం,మదన్ మోహన్,ఎస్ స్వామి రెడి,్డసీజీఎం లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News