Monday, January 20, 2025

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత

- Advertisement -
- Advertisement -

గోషామహల్: దైవచింతన, ఆధ్యాత్మిక కార్యక్రమా ల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని బీఆర్‌ఎస్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్ అన్నారు. సిక్వాల్ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో బేగంబజార్ దాల్‌మండిలోని సిక్వాల్ భవన్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన వేదమాత గాయత్రి, రాధాకృష్ణల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారంతో ముగిసింది.

ఈ కార్యక్రమంలో దాసోజు శ్రవణ్, గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇంచార్జి నందకిశోర్‌వ్యాస్, బేగంబజార్ డివిజన్ బీఆర్‌ఎస్ ఇం చార్జి పూజావ్యాస్ బిలాల్, సెట్విన్ సంస్థ మాజీ డైరెక్టర్, సీనియర్ బిఆర్‌ఎస్ నేత ఎస్ ధన్‌రాజ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించా రు.

ఈ సందర్బంగా వారు పూజా కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన సాధు సంతులు, స్వామీజీలు కమలనయనదాస్ మ హారాజ్, సచ్చిదానంద సరస్వతీ స్వామీ, త్రిదండి స్వామి భక్తిభూష న్, దామోదర గోస్వామీ, డాక్టర్ దాస్‌జీ, రాహుల్ దాస్‌జీ, ప్రభు దా స్‌జీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిక్వాల్ సమా జ్ ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News