Monday, December 23, 2024

యోగాతోనే మానసిక ప్రశాంతత

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని రోజువారీగా యోగా చేస్తే మానసికంగా ప్రశాంతతో పాటు శరీర నిర్మాణంలో మార్పు వస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ తన చాణక్య నీతితో ప్రపంచం మొత్తం యోగా సాధన చేసే విధంగా ఐరాసలో ప్రతిపాదన పెట్టి అన్ని దేశాల ఆమోదంతో ప్రతీ సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు.

ఉరుకుల పరుగుల జీవితంలో నేడు ప్రతీ ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నందున ప్రతీ ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగా సాధన చేసినట్లయితే ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, జిల్లా నాయకులు జలగం వెంకన్న, అలిసేరి రవిబాబు, మంగళపల్లి యాకయ్య, పైండ్ల రాజేశ్, రాయపురం రాజ్‌కుమార్, భరత్, శివ, సంతోశ్, రాజగోపాల్, శశి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News