- Advertisement -
వాషింగ్టన్: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శాంతియుత ఆందోళనకు అనుమతించి, ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలని, ప్రజాస్వామిక విలువలకు హామీ ఇవ్వాలని భారత ప్రభుత్వానికి అమెరికా కాంగ్రెసియనల్ ఇండియా కాకస్ విజ్ఞప్తి చేసింది. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధులసభ సభ్యులతో కూడిన ఈ సంస్థ కోచైర్మన్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన బ్రాడ్ షెర్మన్ ఈ విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో కోచైర్మన్ స్టీవ్ చాబాట్, వైస్ చైర్మన్ రోఖన్నాతో సమావేశం అనంతంరం షెర్మన్ ఈ ప్రకటన చేశారు. దీనిపై అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్‌సింగ్‌సంధూకు తమ విజ్ఞాపన అందించనున్నట్టు తెలిపారు. ఈ అంశంలో భారత్‌లోని భాగస్వామ్య పక్షాలన్నీ ఓ అంగీకారానికి రాగలవని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతుల అంశంపై ఈ సంస్థ మొదటిసారిగా సమావేశం కావడం గమనార్హం.
- Advertisement -