Sunday, December 22, 2024

జనం నుంచి జలంలోకి…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, సిటీబ్యూరో: అశేష భక్త జనసందోహం మధ్య మహాగణపతి గంగమ్మ ఒడిలోకి చేరారు. భక్తుల జయజయ ధ్వానాలు,నృత్యాలు, డిజె పాటల మధ్య హైదరాబాద్ నగర, శివారు ప్రాంతాల గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లక్షలాది మంది భక్తులు హుస్సేన్‌సాగర్‌కు చేరుకుని గణపతులకు బైబై చెప్పుతూ తమ భక్తిపారవశ్యాన్ని చాటుకున్నారు. హుస్సేన్‌సాగర్, నెక్లెస్‌రోడ్, ఎన్టీయార్ మార్గ్, ట్యాంక్‌బండ్ ప్రాం తాల్లో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నూ వినాయకుల నిమజ్జనాలు కన్నులపండుగగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది ల క్షా 40 వేల గణపతి విగ్రహాల ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాల అంచనా. మంగళవారం రాత్రి వ రకు సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనం పూర్తికానున్నాయనీ, మరో 40 వేల విగ్రహాలు బుధవారం ఉదయానికి నిమజ్జన పూర్తిచేసుకోనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌లోనే 30 వే ల గణపతి విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు అధికా ర వర్గాల సమాచారం.నిమజ్జనం సందర్భంగా వి గ్రహాలకు ప్రత్యేక రూట్ మ్యాప్, ట్రాఫిక్ మళ్ళింపులు, పోలీసుల పహారా, భద్రతా ఏర్పాట్లు, భ క్తులు తిలకించేందుకు సౌలభ్యం, వారికి తాగునీరు వంటివి అధికారులు కల్పించారు.

మహాగణపతి..
ఖైరతాబాద్ మహాగణపతికి అర్ధరాత్రి తర్వాత కలశపూజ అనంతరం భారీ ట్రాలీపైకి చేర్చారు. మొత్తం రెండున్నరకిలో మీటర్లమేర గణనాథుడి శోభాయాత్ర సాగింది. నిమజ్జనం ఉదయం 6:30 గం.లకు మొదలై మ.1.40గం.లకు పూర్తయ్యిం ది. ఈ భారీ గణనాథుడిని తీసుకెళ్తున్న వాహనానికి ముందు రెండంచెల రోప్ పార్టీలు ఏర్పాటుచేశారు. 700 మంది పోలీసులతో భారీ బందోబస్త్ కల్పించారు. 70 ఏళ్ల సందర్భంగా రూ.కోటికి పైగా ఖర్చుతో 70 అడుగుల మహాగణపతిని తయారుచేశారు. శ్రీసప్త ముఖ మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున పార్వతి కళ్యాణం, కాళ్ల వద్ద అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని నిలిపారు. గణనాథుడి బరువు సుమారు 40 50 టన్నులు ఐరన్, పిచూ.. మట్టిని వినియోగించారు. గణపయ్యకు ఈ ఏడాది హుండీ ఆ దాయం రూ.70 లక్షలు, ప్రకటనలు, హోర్డింగ్స్ ద్వారా రూ.40 లక్షలు, మొత్తంగా రూ.కోటీ 10 లక్షలు వచ్చింది. బాలాపూర్ వినాయకుడు ఉ. 11.10 గం.లకు శోభయాత్ర ప్రారంభమై చార్మినార్ అబిడ్స్, బషీర్‌బాగ్‌ల మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకుని మ.2.10గం.లకు నిమజ్జనం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News