Friday, November 15, 2024

దేశ ప్రజల ఆకాంక్షమేరకే శాంతియుత సత్యాగ్రహం: రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

Peaceful 'satyagraha' of Farmers in national interest: Rahul

 

న్యూఢిల్లీ: అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం దేశ ప్రజల అభీష్టం మేరకే జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులు, వ్యవసాయ కూలీలకేగాక, దేశ ప్రజలందరికీ ప్రమాదమేనని రాహుల్ ట్విట్ చేశారు. శనివారం రైతులు చేపట్టిన చక్కాజామ్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్ తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో పలు వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసిన ఫోటోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భయం అనే అడ్డుగోడతో మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌పై నిషేధం విధించడం, పోలీసుల వేధింపులకు నిరసనగా దేశవ్యాప్త రహదారుల దిగ్బంధానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. చక్కాజామ్‌కు మద్దతు ఇస్తున్నట్టు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News