Tuesday, November 5, 2024

రాత్రి ఉష్ణోగ్రతలు 20,25 డిగ్రీలు ఉంటేనే వృద్ధులకు ప్రశాంత నిద్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పరిసరాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటేనే వయోవృద్ధులు ప్రశాంతంగా నిద్ర పోతారని కొత్తగా వెలువడిన అధ్యయనం వెల్లడించింది. వ్యక్తిగతంగా ఉన్న తేడాలను అధ్యయనం చేసినప్పటికీ, రాత్రుళ్లు పడకగది ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు పెరగడం వల్ల 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో నిద్ర సామర్ధం 5 నుంచి 10 శాతం వరకు తగ్గిపోయిందని అధ్యయనం పేర్కొంది. అలాగే వృద్ధుల్లో బుద్ధి క్షీణించడం, చిత్తవైకల్యం ( డెమెన్షియా) తదితర లక్షణాలకు సుదీర్ఘకాల నిద్ర నాణ్యత తగ్గడానికి సంబంధం ఉందని అధ్యయనం వివరించింది.

అమెరికా లోని బోస్టన్ కు చెందిన మార్కస్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఏజింగ్ రీసెర్చి అండ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఈ అధ్యయనం నిర్వహించింది. వ్యక్తిగత అవసరాలు, పరిస్థితుల ఆధారంగా ఇంటి లోని వేడి వాతావరణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చని పేర్కొంది. వాతావరణ మార్పులు, నగరాల ప్రేరేపిత వేడి కారణంగా ఈ అధ్యయనం ప్రాధాన్యత ఎంతో ఉంది. నిద్రకు సంబంధించి అనేక వైద్యపరమైన, ప్రవర్తనా పరమైన మార్గాలు అభివృద్ధి చెందినప్పటికీ, పర్యావరణ పరిస్థితులు అంచనా వేయడంలో నిర్లక్షం బాగా జరిగింది. నిద్రపై పరిసరాల ఉష్ణోగ్రతల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి 50 వృద్ధ నివాస సమాజాల నుంచి 212 రాత్రుళ్ల పర్యావరణ డేటాను సేకరించారు. మొత్తం 10,903 మంది వ్యక్తుల రాత్రుళ్ల నిద్రను అధ్యయనం చేశారు. 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News