- Advertisement -
మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో రైతు అశోక్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద అస్వస్థతకు గురైన నెమలిని ఆదివారం ఫారెస్ట్ ఆఫీసర్‌కు అప్పగించారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక అస్వస్థతకు గురైన పడి ఉన్న నెమలిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గోపాలమిత్ర మెండె సతీష్ నెమలికి చికిత్స చేయగా ఫారెస్ట్ మోత్కూరు బీట్ ఆఫీసర్ కృష్ణయ్యకు అప్పగించారు. నెమలిని కోలుకున్న తర్వాత తిరిగి అడవిలో వదిలి పెడతామని తెలిపారు.
- Advertisement -