Friday, January 24, 2025

పగటి సమయానికి మారిన దేశ గరిష్ట విద్యుత్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఫీడర్ సరేషన్ లేదా సోలార్ ప్లాంట్ల నుంచి వ్యవసాయ పొలాలకు విద్యుత్‌ను తీసుకెళ్ళేందుకు ప్రత్యేక కేబుల్ ఉపయోగించడంతో వ్యవసాయ విద్యుత్‌భారాన్ని పగటి సమయానికి మార్చినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథార్థీ (సిఈఏ) వెల్లడించింది. దేశ పీక్ పవర్ డిమాండ్ సాయంత్ర నుంచి పగటికి మారినట్లు తెలిపింది. ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్(వేసవిలో)222 గిగావాట్స్ మధ్యాహ్నాం మూడు గంటల సమయంలో పెరిగినట్లు తెలిపింది. ఫీడర్ సపరేషన్ ద్వారా ఇది సాధ్యమైనట్లు పేర్కొంది.

సోలార్ ప్లాంట్ల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు ప్రత్యేక కేబుళ్ళు విద్యుత్‌ను తీసుకెళుతుంటాయని, ఫీడర్ వేరు కావడంతో వ్యసాయ భారం పగటికి సమయానికి మారిందన్నారు. సోలార్ లేని సమయాల్లో గ్రీన్ పవర్‌కి ఇప్పటికీ డిమాండ్ ఉన్నట్లు తెలిపింది. విద్యుత్ పంపిణీ సంస్థలు రాబోయే సంవత్సరాల్లో విద్యుత్ నిల్వడిమాండ్‌ను అంచనావేసేందుకు రీసోర్స్ అడిక్వసీ మ్యాపింగ్ చేయాలని సీఈఏ ఆదేశించింది. దాంతో పాటు రాష్ట్రా, ప్రాంతాల లోడ్ డిస్పాచ్‌లు కేంద్రాలు సంవత్సరం పాటు ఒక అంచన వేస్తాయని పేర్కొంది. 2026- 27 నుంచి స్టోరేజ్ అవసరాలు పెరుగుతాయని సీఈఏ అంచనా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News