Monday, December 23, 2024

హరితహారంలో పెబ్బేరు పట్టణం నెం. 1

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహా రంలో పెబ్బేరు పట్టణానికి రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. తెలంగాణ రాష్ట్ర అవతర ణ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా సోమవా రం రాత్రి రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ హరితోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే హరితహారంలో పెబ్బేరు పట్టణం నెంబర్ వన్‌గా నిలిచిందని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ తెలిపారు.

ఈ సందర్భంగా దేవాదాయ, న్యాయ, అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ కరుణ శ్రీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో హరితహారంలో ప్రథమ అవార్డు లభించడం హర్షణీయమన్నా రు. ఇందుకోసం కృషి చేసిన పుర కమిషనర్ ఆదిశేషు, వైస్ చైర్మెన్ కర్రెస్వామి, పుర కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News