Friday, December 27, 2024

12 వరకు పిఇసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

PECET application deadline extension till 12

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్ పిఇసెట్) దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఆగస్టు 12వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని, దరఖాస్తులను సమర్పించ వచ్చని పిఇసెట్ కన్వీనర్ సత్యనారాయణ వెల్లడించారు.బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ, ఇంటర్మీడియట్, పూర్తి చేసిన అభ్యర్థులు లేదా చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు. పిఇసెట్‌కు ఇప్పటివరకు 3,047 దరఖాస్తులు వచ్చాయని,అందులో బిపిఇడికి 1,760, డిపిఇడికి 1,287 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News