Saturday, January 11, 2025

ఎంఆర్ఒ కార్యాలయంలో తహసీల్దార్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంఆర్ఒ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో జరిగింది. తహసీల్దార్ శ్రీనివాస రావు గురువారం ఉదయం మండల కార్యాలయానికి వచ్చాడు. టిఫిన్ తీసుకరమ్మని అటెండర్ కు చెప్పాడు. అటెండర్ టిఫిన్ తీసుకొని కార్యాలయానికి వచ్చేసరికి షెడ్ లో శ్రీనివాస రావు ఉరేసుకొని కనిపించాడు. కలెక్టర్ తో జరిగిన సమావేశంలో భూముల సర్వే విషయంలో ఉన్నతాధికారులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ మనస్థాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News