Monday, January 20, 2025

గుంటూరులో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పెదకాకాని గ్రామ శివారులో ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పెదకాకాని గ్రామానికి చెందిన దానబోయిన మహేశ్(22), నందిగామ మండల రుద్రవరం గ్రామానికి చెందిన శైలజ సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నారు. మహేశ్ గత కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఓ మొబైల్ షాపులో పని చేసేవాడు. మొబైల్ షాపుకు వచ్చిన శైలజతో పరిచయం ఏర్పడడంతో ప్రేమగా మారింది. ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ యువతి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. యువతి కోసం ఆమె కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం పెదకాకానికి చేరుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News