Tuesday, January 21, 2025

సిలిండర్ కోసం భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

అమరావతి: కూతురుకు సిలిండర్ ఇచ్చావని దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను భర్త చంపాడు. ఈ సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పాములపాడు గ్రామంలోని దుళ్లవానిగూడెంలో వేమూరుఇ వెంకటేశ్వరరావు(72), జమమ్మ(67) అనే దంపతులు నివసిస్తున్నారు. జయమ్మ తన భర్తకు చెప్పకుండా కూతురు గ్యాస్ బండ ఇచ్చింది. దీంతో గ్యాస్ కూతురు ఎందుకు ఇచ్చావని భార్యను భర్త ప్రశ్నించాడు.

దీంతో దంపతులు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త భార్య తలను మంచం కోడుకు కొట్టడంతో ఆమె ఘటనా స్థలంలో చనిపోయింది. అనంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి రైలు పట్టాలపై వేసి ఆత్మహత్య చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి అడగడంతో శవాన్ని వదిలేసి భర్త పారిపోయాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News