- Advertisement -
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పెద్దముబారక్‌పూర్ సర్పంచ్ దిగంబర్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్పంచ్ దిగంబర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. సర్పంచ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆరోగ్యం బాగోలేదంటూ, చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాక గ్రామానికి న్యాయం చేయలేకపోతున్నానని సర్పంచ్ పదవికి దిగంబర్ రాజీనామా చేస్తున్న పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించినట్లు గతవారం క్రితం ఆయన విలేకరులతో తెలియజేశారు. అయితే రాజీనామాను కలెక్టర్ అధికారికంగా ఆమోద ప్రకటన చేయలేదు. సర్పంచ్ దిగంబర్ మృతిపై సర్పంచుల ఫోరం, పలువురు సంతాపం తెలియజేశారు. సర్పంచ్ మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -