Saturday, November 16, 2024

ఘనంగా నెలవారం….

- Advertisement -
- Advertisement -

హాజరైన మున్నా,
మెంత బోయిన వంశస్థులు
దేవరపెట్టే తరలింపు
నేడు ముగియనున్న జాతర

Peddagattu jatara information in telugu

మన తెలంగాణ/చివ్వెంల : గత నాలుగు రోజులుగా పెద్దగట్టుపై జరుగుతున్న శ్రీ లింగమంతుల స్వామి జాతర సందర్భంగా బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నెలవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన కి మెంతబోయిన వంశస్థులు నిద్ర ఘట్టంలో భాగంగా కే సారం చేరుకొని అక్కడి నుంచి ఉదయాన్నే లేచి పెద్దగట్టు కు చేరుకున్నారు. అనంతరం చంద్రపట్నం వద్ద మొ క్కులు చెల్లించి దేవరపెట్టెను కదిలించి పక్కనబెట్టారు. చౌ డమ్మ తల్లికి నెలవారం పిల్లను బలిచ్చి గొర్రె మాంసాన్ని మున్నా, మెంతబోయిన, బైకాన్లు మూడు భాగాలు పంచుకొని ప్రసాదంగా స్వీకరించారు. దీంతో శుక్రవారం కార్యక్రమం పూర్తి అయ్యింది.
-నెలవారం ఇలా…
యాదవ సంప్రదాయం ప్రకారం మెంతబోయిన వంశస్థులు కేసారం గ్రామంలో రాత్రి నిద్ర లేశారు. అనంతరం ఉదయమే లేచి కుటుంబ సభ్యులతో పెద్దగట్టు వద్దకు చే రుకొని విడిది ప్రాంతం వద్ద చేసి దేవరగుడి నుండి మందగంప, కొత్తకుండల, గొర్రెను పట్టుకొని ఊరేగింపుగా పెద్దగట్టుకు చేరుకున్నారు. విడిది ప్రాంతంలో మున్నా, మె ంతబోయిన వంశస్థులు కేసారం గ్రామం నుంచి పాలు, రెండు కొత్తకుండలో పోసి మూడు సార్లు పొంగిస్తారు. తర్వాత ఒక కుండలో బియ్యం, బెల్లం, పసుపు, పాలు పోసి మరొక కుండలో బియ్యం, చక్కెర పోసి బోనాలుగా వండినారు. వండిన బోనాలను పసుపు, కుంకుమ, బంతి పూలతో అలంకరించారు. బైకాని వాయిద్యాల మధ్య ము న్న, మెంతబోయిన వారు రోండు బోనాలు ఎత్తుకొని రెం డు బోనాలను లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లి గర్భగుడి వద్దకు ఊరేగింపుగా వచ్చారు. వారు తెచ్చిన బో నాలను కొంత అన్నం తీసి ముందుగా లింగమంతుల స్వామి చౌడమ్మలకు నైవేద్యంగా పెట్టారు. ఆలయం ము ందు ఉన్న పుట్ట దగ్గర కూడా నైవేద్యం పెట్టారు. దేవరపెట్టె గల చంద్రపట్నం వద్దకు వచ్చి నైవేద్యం పెట్టి మొ క్కులు చెల్లించుకున్నారు. బైకాని వారు వైద్యాలు వైపుండగా మున్నా మెంతబోయిన వారు లింగా.. ఓలింగా అ ంటూ చంద్రపట్నంపై నున్న దేవరపెట్టెను కదిలించి ఎత్తి పక్కన పెట్టారు. ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా తమ వంతు అభివృద్ధి జరుగుతుందని గొల్లల నమ్మకం సాయంత్రం మున్నా మెంతబోయిన వారు చంద్రపట్నం వద్ద హస్తాలు వేసి మొక్కి కళ్లకు అద్దుకున్నారు. చంద్రపట్నం ఊడ్చి కొత్తగుడ్డలో ఎత్తి తీసుకుపోయి ఆలయం ముందున్న పుట్టలో పోశారు. దీంతోదీంతో మం గళవారం కార్యక్రమం ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News