Friday, December 20, 2024

సందడిగా మారిన పెద్దమ్మతల్లి దేవాలయం

- Advertisement -
- Advertisement -

పాల్వంచ : మండల పరిధి కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్యన కొలువై ఉన్న (శ్రీకనకదుర్గ) పెద్దమ్మతల్లి దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుములు, బోనాలు తదితర మొక్కులు సమర్పించారు. క్యూలైన్‌లో భక్తులకు ఉచిత పులిహోర ప్రసాద వితరణ, మంచినీటి వసతి కల్పించారు.

  • నేడు చంఢీహోమం

దేవాలయ ఆవరణంలో గల యాగశాలలో నేడు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాణాదికారి ఎన్. రజనీ కుమారి తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా గానీ అదే రోజు గానీ రూ. 2516/లు చెల్లించి రసీదు తీసుకొని గోత్ర నామాలను నమోదు చేసుకోవాలన్నారు. అదే విధంగా సాంప్రదాయ దుస్తులతో హోమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనివారి పేరు మీద సంకల్పం చేసి హోమం నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 9866923261 లేదా 6303408458 లకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News