Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌కు షాక్‌… ఆ ఎంపి కాంగ్రెస్ లోకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికల సమీపిస్తున్న క్రమంలో బిఆర్‌ఎస్‌ కు షాక్ తగిలింది. పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపి బోర్లకుంట వెంకటేష్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపి వెంకటేష్, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్ కూడా  కాంగ్రెస్ లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయని రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంపి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తో కలిసి ఆయన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు.

Peddapalli BRS MP Borlakunta Venkatesh joined Congress

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News