Thursday, January 23, 2025

పెద్దపల్లిలో అగ్ని ప్రమాదం… రెండు షాపులు దగ్ధం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా కూడలీ సమీపంలో అగ్రి ప్రమాదం జరిగింది. శుక్రవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో మొబైల్ షాప్, పూజా సామాగ్రి దుకాణంలో మంటలు చెలరేగాయి. రెండు షాపులు పూర్తిగా దగ్ధం కావడంతో పాటు మరో రెండు షాపులు పాక్షికంగా కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. సుమారుగా రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News