Wednesday, January 22, 2025

గడ్డం బ్రదర్స్ గట్టెక్కించేనా?

- Advertisement -
- Advertisement -

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్సే..
ఎమ్మెల్యేలు తలచుకుంటేనే గెలుపు ఖాయం

ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు
వారసుడు వంశీకృష్ణ గెలుపునకు ప్రయత్నాలు

కోల తిరుపతి/ కరీంనగర్: ఉమ్మడి జిల్లా బ్యూరో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణా తండ్రికి ( ఎమ్మెల్యే వివేకానంద) తగ్గ వారసునిగా అందరితో కలిసి పోయే వ్యక్తిత్వం.పెద్దపల్లి లోకసభ స్థానానికి టికెట్ దక్కించుకోవడం అతని పోరాటం ఫలించింది. ఈ వ్యూహంలో ఎంతో మంది చతురులు, తల పండిన వారు ఎంపి టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా ఆధిష్ఠానం ఆశీస్సులు మాత్రం వంశీకే దక్కాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండ డంతో గడ్డం బ్రదర్స్ అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేకానందలకు పెద్దపల్లి పార్లమెంట్ ఇప్పుడు సవాల్‌గా మారింది.

పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో ఏడు నియోజవర్గాల్లో , ఏడు అసెంబ్లీ నియోజవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు ఎంపి అభ్యర్థి వంశీకృష్ణా గెలుపు కోసం ముందుండి పనిచేస్తే వంద శాతం గెలిచే ఛాన్స్ ఉంది. గత ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కొప్పుల ఈశ్వర్ ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థిగా గులాబీ బాస్ బరిలో నిలిపారు. మాజీ మంత్రి కొప్పులకు సానుభూతి పవనాలు విస్తున్నాయని ప్రజల్లో చర్చ జరుగుతుండగా గెలుపు నాదే అనే ధీమాలో ఉన్నారు.

ఏదీ ఏమైనా అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి పెద్దపల్లి పార్లమెంట్ సవాల్‌గా మారింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో ఏడు నియోజవర్గాల్లో ఏడు అసెంబ్లీ నియోజవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పెద్దపలికి చింతకుంట విజయరామణరావు, రామగుండంకు మక్కాన్ సింగ్, మంథనికి మంత్రి శ్రీధర్ బాబు, ధర్మపురికి వడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరుకు వివేకానంద, మంచిర్యాలకు ప్రేమ్ సాగర్‌రావు, బెల్లంపల్లికి గడ్డం వినోద్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌కు ఇప్పటికే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులను ప్రకటించిన సంగతి విధితమే. కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణా, బిఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పలు ఈశ్వర్, బిజెపి గోమాస శ్రీనివాస్‌లను ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండడంతో గడ్డం బ్రదర్స్ అయిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేకానందలకు పెద్దపల్లి పార్లమెంట్ ఇప్పడు సవాల్‌గా మారింది. కాంగ్రెస్ నుండి టికెట్ సాధించుకోవడంలో వంశీ కృష్ణా గడ్డం కుటుంబంలో మూడో తరం నాయకుడు.

ముందస్తు వ్యూహంతో గడ్డం వంశీకృష్ణా గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నుండే చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం ఆశీస్తూనే అందరితో మమేకం అవుతూ సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ కృష్ణాకు టికెట్ రావడంతోనే గెలుపు ఖాయం అయిందని వివేక్ అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన ఏవరు కూడా స్థానికంగా ఉండకపోవడం, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నుండి పోటీ చేసి ఓటమి చెందారు. పెద్దపల్లి పార్లమెంట్ ని యోజకవర్గం (ఎస్‌సి) రిజర్వుడ్ కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థిగా కొప్పులను బరిలో నిలిపారు. కార్మిక లీడర్‌గా మంచి మనసున్న మహారాజుగా పేరున్న వక్తి కొప్పుల ఈశ్వర్. ఈ జరగబోయే లోకసభ ఎన్నికల్లో కొప్పులకు సానుభూతి పవనాలు విస్తాయని జనంలో చర్చ కొనసాగింది.

ఒకే కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటూ.. నాకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని మాజీ మం త్రి కొప్పులు ప్రచార అస్త్రంగా మలిచి ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. గడ్డం వంశీకి గెలుపు కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. వంశీ గెలుపు కోసం గడ్డం బ్రదర్స్ అన్ని తానై వ్యూహం రచిస్తూ ముందుకు సాగుతున్నారు. గోమసా శ్రీనివాస్ గతంలో బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థిగా బరిలో నిలిచి గడ్డం వివేక్ చేతిలో ఓటమి చెందగా ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచి మోడీ గాలీ వీస్తుందని ధీమాతో ఉన్నాడు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రాతినిథ్యం ప్రజల్లో ఉంటూ ఓట్లను అభ్యర్థిస్తూ.. ప్రచారాన్ని కొనసాగిస్తున్నా రు. యువనేత కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణా మాత్రం పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచిన తనను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే ధీమాతో ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News